కమెడియన్ పొట్టి రాంబాబు కన్నుమూత

కమెడియన్ పొట్టి రాంబాబు కన్నుమూత

Published on Dec 29, 2015 10:15 AM IST

potti-ram-babu
తెలుగు సినీ పరిశ్రమ మరో హాస్య నటుడిని కోల్పోయింది. ప్రభాస్ హీరోగా నటించిన ‘ఈశ్వర్’ అనే సినిమాతో తెలుగు సినీ పరిశ్రమకు హాస్య నటుడిగా పరిచయమై, ఆ తర్వాత తనదైన స్టైల్లో అందరినీ మెప్పిస్తూ 40కి పైగా సినిమాల్లో నటించిన పొట్టి రాంబాబు ఈ ఉదయం హైద్రాబాద్‌లో కన్నుమూశారు. గత కొద్దికాలంగా మెదడు రక్తం కట్టడంతో బాధపడుతూ వస్తోన్న ఆయన 35 ఏళ్ళ వయసులోనే ఇలా అందరినీ వీడి వెళ్ళిపోవడం విషాదం.

‘చంటిగాడు’, ‘కథానాయకుడు’ లాంటి సినిమాలతో మెప్పించిన రాంబాబు ప్రధాన పాత్రలో ‘పులిరాజా ఐపీఎస్’ సినిమా అనే సినిమా చేస్తున్న సమయంలో మెదడుకు సంబంధించిన వ్యాధితో చికిత్స తీసుకుంటూ వస్తున్నారు. ఇక ఆయన మృతి పట్ల సినీ పరిశ్రమ దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ సంతాపం ప్రకటించింది. చిన్న వయసులోనే మనల్ని వదిలిపోయిన పొట్టి రాంబాబు ఆత్మకు శాంతి కలగలాని కోరుకుంటూ 123తెలుగు తరపున సంతాపం ప్రకటిస్తున్నాం.

తాజా వార్తలు