సినిమా..థియేటర్లోనే ఉంటుంది, నిలబడుతుంది – వై వి ఎస్

సినిమా..థియేటర్లోనే ఉంటుంది, నిలబడుతుంది – వై వి ఎస్

Published on May 23, 2020 12:41 AM IST

ప్రస్తుతం ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన కంటికి కనిపించని సూక్ష్మ వైరస్ కరోనా మూలాన ఎన్నో రంగాలు స్తంభించిపోయాయి. వాటిలో మానవుల దైనిందిన చర్యలలో ఒక భాగంగా మారిపోయిన సినిమా రంగం కూడా స్తంభించిపోయింది. వాటిలో మన తెలుగు చలన చిత్ర పరిశ్రమ కూడా ఒకటి. దీనితో ఎన్నో పూర్తి కాబడిన సినిమాలు విడుదల ఆగిపోయాయి,మరికొన్ని ఓటిటి బాట పట్టాయి.

దీనితో ఇప్పుడు సినీ ప్రేమికుల మదిలో ఎన్నో అంతు చిక్కని ప్రశ్నలు తెలుగు సినిమా విషయంలో అలా మెదులుతూనే ఉన్నాయి. వీటన్నిటికీ ఒక క్లారిటీ ఇస్తూ టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు వై వి ఎస్ చౌదరి ఈ మే 23 తన పుట్టినరోజు సందర్భంగా తనలా కళామాతల్లిని ప్రేమించే వారి మాటగా సినిమా కోసం తన వెర్షన్ ను వెలుబుచ్చారు.

మనిషి ఎలా ఉన్నా ఏం చేసినా సరే సినిమా కోసం మాట్లాడుకుంటూనే ఉంటాడని ఆలు సినిమా ఊసే అనేది లేకుంటే పొద్దు పోని వాళ్ళు కూడా లేరు అనడంలో ఎలాంటి అతిశేయోక్తి లేదని అన్నారు. దూర దర్శన్ నుంచి ఎల్ డి ప్లేయర్స్ వరకు, వీడియో పైరసి నుంచి ఇప్పటి ఛానెల్స్ వరకు, టీవీ సీరియల్స్, ఎన్నో ఎంటర్టైనింగ్ ప్రోగ్రామ్స్, అలాగే ఇప్పుడు అమెజాన్ ప్రైమ్, నెట్ ఫ్లిక్స్ లు ఇలా ఎన్ని వచ్చినా సారీ థియేటర్ లో సినిమా నిలబడుతుంది అని తెలిపారు.

అలా సముద్రంలాంటి సినిమాను ఈ కోవిడ్ 19 కాదు ఏది కూడా ఆపలేదని తెలిపారు. సినిమా అనుభూతిని వెండితెర మీద తప్ప మరే ఇతర మాంద్యం ద్వారా పొందలేమని అలాగే సినిమాలో పొందే అనుభూతి మనకు తెలియకుండానే ఎన్నో ఎమోషన్స్ ను కైగొంటాం అని అందుకే సినిమాకు బ్రహ్మోత్సవాలు పట్టాభిషేకాలు చేస్తారని తాను బలంగా నమ్ముతా అని వెల్లడించారు.

అలా తాను తన “లాహిరి లాహిరి లాహిరిలో” నుంచి “రేయ్” వరకు పాత్రలు చెప్పిన మాటలు వాటి ద్వారా తాను పొందిన ఫలితాలను కానీ తన సన్నిహితులు చెప్పే మాటలను కానీ బలంగా నమ్ముతున్నా అని మే 23 నా జన్మదినం, ఈ సందర్భంగా నాకు జన్మనిచ్చివ నా తల్లిదండ్రులకు నాకు విద్యాబుద్ధులు చెప్పిన నా గురువులందరికీ, తన దివ్వమాహనరూపంతో సినిమా పట్ల సినిమా రంగం పట్ల నాకు ఆకర్షణ పెంపొందించిన అన్న ‘ఎన్. టి. ఆర్.” గారికి, నాకు దర్శకుడిగా..

జన్మనిచ్చిన ‘సెల్యూలాయిడ్ సైంటిస్ట్’ “అక్కినేని నాగార్జున గారికి ,అలా తనకు ఇప్పటి వరకు అండగా ఉన్న సన్నిహితులు ఇతర నటులు అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ కోవిడ్ 19 వలన అడవి కాచిన వెన్నెలలా మారిన తెలుగు పరిశ్రమ త్వరలోనే జన జీవన స్రవంతిలో కలసిపోయి పూర్వ ప్రకాశాన్ని పొందాలని కోరుకుంటున్నా అని వై వి ఎస్ చౌదరి తెలిపారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు