సామాజిక బాధ్యత నెరవేర్చిన స్టార్ హీరోలు

Published on Mar 18, 2020 8:16 am IST

ప్రపంచం కోరినా గుప్పిట్లో చిక్కుకొని వణుకుతున్న వేళ… టాలీవుడ్ స్టార్ హీరోలు ఫ్యాన్స్ మరియు తెలుగు ప్రజల కోసం తమ వంతు బాధ్యత నెరవేర్చుతున్నారు. ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ ఇప్పటికే ఓ చిన్న వీడియో ద్వారా కరోనా వైరస్ బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెప్పడంతో పాటు, అపోహలపై అవగాహన కల్పించారు. అలాగే సూపర్ స్టార్ మహేష్ కూడా సోషల్ మీడియా వేదికగా సందేశం పంపారు. సోషల్ లైఫ్ కి దూరంగా ఉండాలని కోరారు. జనసమర్థం ఉన్న ప్రదేశాలకు వెళ్లకూడదని హితవు పలికారు.

ఇక మరోస్టార్ హీరో ప్రభాస్ సైతం సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్స్ కి కొరోనా వైరస్ దరిచేరకుండా తగు జాగ్రత్తలు చెప్పడం జరిగింది. వీరితో పాటు సామాజిక మాధ్యమాల ద్వారా అనేక మంది ప్రముఖులు ప్రజల్లో ఈ ప్రాణాంతక వైరస్ గురించి అవగాహన కల్పించడంతో పాటు, వారిలో ధైర్యం నింపుతున్నారు.

సంబంధిత సమాచారం :

More