టాలీవుడ్ నాకు సొంత ఇల్లులాంటిది – శ్రియ

shriya_saran
ఒకప్పుడు టాలీవుడ్, కోలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా వెలుగొందిన శ్రియ శరణ్ కి ఈ మధ్య కాలంలో ఆఫర్స్ తగ్గాయి. కానీ శ్రియ నటించిన ‘మనం’ సినిమా ఇటీవలే విడుదలై సూపర్ హిట్ అవ్వడంతో శ్రియ మళ్ళీ ఫాంలోకి రావడమే కాకుండా పవన్ కళ్యాణ్ – వెంకటేష్ ‘గోపాల గోపాల’ సినిమాలో ఆఫర్ కూడా కొట్టేసింది.

‘మనం సినిమాపై సూపర్బ్ మెసేజెస్ పంపి, ప్రేమ చూపినందుకు అందరికీ థాంక్స్. ఈ సినిమాని ఇంత పెద్ద హిట్ చేసిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా థాంక్స్ చెబుతున్నాను. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ నాకు సొంత ఇల్లు లాంటిది. మళ్ళీ ఇక్కడకి వచ్చి నా సూపర్ స్టార్స్ తో నటిస్తున్నందుకు చాలా అనడంగా ఉంది. మీ సపోర్ట్ కి మరో సారి థాంక్స్’ అని శ్రియ తన మైక్రో బ్లాగ్ లో పోస్ట్ చేసింది. మళ్ళీ శ్రియ టాలీవుడ్ లో లాంగ్రన్ హీరోయిన్ గా చెలామణి అవుతుందేమో చూడాలి.

Exit mobile version