వ్యాక్సినేషన్ డ్రైవ్ చేపడుతున్న నిర్మాతలు

Published on Jun 3, 2021 11:03 pm IST

కరోనా సెకండ్ వేవ్ ఉధృతికి టాలీవుడ్ పరిశ్రమ మూతబడింది. షూటింగ్స్ అన్నీ ఆగిపోయాయి. ఎక్కడి సినిమాలు అక్కడే నిలిచిపోయాయి. షూటింగ్స్ ఆగిపోయి ఇప్పటికే నెలన్నర కావొస్తోంది. ఇప్పుడిప్పుడే కేసుల సంఖ్య తగ్గుతోంది. దీంతో చిత్రీకరణలు రీస్టార్ట్ చేయాలని చూస్తున్నారు చాలా మంది నిర్మాతలు. అందుకే ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా తమ సినిమా బృందాలకు వ్యాక్సిన్ వేయిస్తున్నారు నిర్మాతలు. ప్రైవేటుగా వ్యాక్సిన్ తీసుకోవచ్చని ప్రభుత్వం అనుమతులు ఇవ్వడం జరిగింది.

దీంతో పలు సినిమా ఆఫీసుల్లో వ్యాక్సినేషన్ డ్రైవ్ చేపడుతున్నారు నిర్మాతలు. అందరు నిర్మాతలు ఇదే విధంగా వ్యాక్సినేషన్ డ్రైవ్ మొదలుపెడితే త్వరలోనే ఇండస్ట్రీలోని అందరికీ ఫస్ట్ డోస్ పూర్తవుతుంది. అప్పుడు ఇంకాస్త ధైర్యంగా షూటింగ్స్ మొదలుపెట్టవచ్చు. ఇకపోతే ఈ జూన్ నెల నుండి కొన్ని సినిమాల షూటింగ్స్ రీస్టార్ట్ కానున్నాయి. ‘ఎఫ్ 3, అఖండ’ సినిమాలతో పాటు నాగార్జున కొత్త చిత్రం షూటింగ్ కూడ రీస్టార్ట్ కానుంది. ఇంకొన్ని చిన్న, మధ్యతరహా సినిమాల షూటింగ్స్ కూడ మొదలుకానున్నాయి.

సంబంధిత సమాచారం :