రీసెంట్ గా తెలుగు యువతని ఆకట్టుకున్న రోమ్ కామ్ చిత్రం ‘పతంగ్’ (Patang) కూడా ఒకటి. యువ నటీనటులు ప్రణవ్ కౌశిక్, వంశీ పుజిత్, ప్రీతీ పగడాల జంటలుగా ఎస్ పి చరణ్, ఎస్ ఎస్ కాంచి, గౌతమ్ మీనన్ లాంటి నోటెడ్ తారాగణంతో దర్శకుడు ప్రవీణ్ ప్రత్తిపాటి తెరకెక్కించిన ఈ సినిమా థియేటర్స్ లో చూసిన వారు అందరినీ అలరించింది.
మంచి ఫన్ అండ్ రొమాంటిక్ ఇంట్రెస్టింగ్ గా సాగే క్లైమాక్స్ తో ఈ సినిమా ఆడియెన్స్ ని ఇంప్రెస్ చేసింది. ఇక ఫైనల్ గా ఈ చిత్రం ఓటిటిలో ఇవాళ్టి నుంచే అందుబాటులోకి వచ్చేసింది. ఈ సినిమాని సన్ నెక్స్ట్ వారు సొంతం చేసుకోగా వారు ఊహించని విధంగా పాన్ ఇండియా భాషల్లో ఈ చిత్రాన్ని తీసుకుని రావడం విశేషం.
దీనితో ఒక్క తెలుగు ఆడియెన్స్ మాత్రమే కాకుండా పాన్ ఇండియా ఆడియెన్స్ ఎంటర్టైన్ కావచ్చు. అలాగే ఓటిటి ఎంట్రీ తర్వాత దీనికి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో కూడా చూడాలి మరి. ఇక ఈ చిత్రానికి జోస్ జిమ్మీ సంగీతం అందించగా విజయ్ శేఖర్ అన్నే, సంపత్ మాకా, సురేష్ రెడ్డి కోతింటి, నాని బండ్రెడ్డి లు నిర్మాణం వహించారు.
సమీక్ష కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
