వచ్చే సంక్రాంతిదే నెవర్ బిఫోర్ సినిమా బ్యాటిల్..!

Published on Feb 28, 2021 11:06 pm IST

మన టాలీవుడ్ లో కొన్ని నెవర్ ఎండింగ్ రైవల్ కాంబో ఏదన్నా ఉంది అంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు సూపర్ స్టార్ మహేష్ బాబుల కాంబో అనే చెప్పాలి. వీరిద్దరూ మంచి స్నేహితులు అయినా బాక్స్ ఆఫీస్ దగ్గరకు వచ్చే సరికి మాత్రం అంతా పోటాపోటీగా వేరే లెవెల్లో ఉంటుంది. మరి అలాగే వీరి అభిమానుల్లో హవా కూడా వేరే లెవెల్..

మరి ఈ ఇద్దరూ బిగ్గెస్ట్ స్టార్స్ కలిసి ఒక సినిమా చేస్తే బాగుంటుంది అని అనుకునే వాళ్ళు కూడా చాలా ఎక్కువనే.. అందుకే వీరి ఫ్యాన్డం కు అంటూ సెపరేట్ పునాది ఉంది..అయితే ఇప్పటి వరకు సంక్రాంతి సినిమా పండుగ అంటే ఒక లెక్కలో ఉండేది కానీ వచ్చే సంక్రాంతి మాత్రం నెవర్ బిఫోర్ గా ఉండడం ఖాయం అయ్యింది.

ఇది వరకే సూపర్ స్టార్ మహేష్ చేస్తున్న మోస్ట్ అవైటెడ్ చిత్రం “సర్కారు వారి పాట” సంక్రాంతి రేస్ టైం ను లాక్ చేసుకోగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్రిష్ తో చేస్తున్న మోస్ట్ అవైటెడ్ సినిమా కూడా సంక్రాంతికే లాక్ అవ్వడం ఇది కదా అసలైన యుద్ధం అనేట్టుగా చేసింది.

ఇద్దరు సమవుజ్జీలు ఏకకాలంలో బాక్స్ ఆఫీస్ బ్యాటిల్ కు దిగితే..ఎట్టా ఉంటాదో అప్పుడు తెలియడం పక్కా అయ్యింది.. దీనితో ఈ నెవర్ బిఫోర్ బాక్స్ ఆఫీస్ యుద్ధాన్ని ఫ్యాన్స్ ప్రస్తుతానికి ఎంజాయ్ చేస్తున్నారు. కానీ అప్పుడు ఎలా ఉంటుందో చూడాలి.

సంబంధిత సమాచారం :