కోమాలోకి వెళ్లిన టాలీవుడ్ సీనియర్ ఆర్టిస్ట్ !

Published on Apr 9, 2020 10:28 pm IST

సినీ ఆర్టిస్ట్ నర్సింగ్ యాదవ్ ఈరోజు ఇంట్లో నాలుగు గంటల సమయంలో ఉన్నట్లు ఉండి కోమాలోకి వెళ్ళిపోయాడు. ప్రస్తుతం హాస్పిటల్ లో తను చికిత్స పొందుతున్నారు. కాగా ఆయన కండిషన్ సీరియస్ గా ఉన్నట్టు డాక్టర్లు చెబుతున్నారు. ఈ విష్యం గురించి నర్సింగ్ యాదవ్ భార్య చిత్ర యాదవ్ మాట్లాడుతూ.. ‘నా భర్త సాయంత్రం 4 గంటలుకు అపస్మారక స్థితిలోకి వెళ్ళాడు దీంతో మేము సోమజిగూడా యశోద ఆస్పత్రికి తరలించాము. ఈ రోజు ఉదయం కూడా డయాలసిస్ చేయించాము అనుకోకుండా కోమలోకి వెళ్ళాడు, 48 గంటలు పాటు అబ్జర్ వేషన్ లో ఉంచారు. ఇంకా వెంటిలేటర్ పై నే చికిత్స కొనసాగుతుంది. ఇంట్లో కింద పడిపోయాడు, తలకి గాయం అయ్యింది అని వస్తున్న వార్త లు అవాస్తవం, తను ఎక్కడ పడిపోలేదు, ఉన్నట్లు ఉండి కోమలోకి వెళ్ళిపోయాడు కోలుకుని తను ఆరోగ్యంగా ఇంటికి రావాలని దేవుని ప్రార్థిస్తున్నాం. సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు ఎవరు నమ్మకండి క్షేమంగా ఇంటికి రావాలని అందరూ కోరుకోండి’ అని ఆమె తెలిపారు.

ఇక నర్సింగ్ యాదవ్ తెలుగు, తమిళ, హిందీ భాషలలో కలిపి సుమారు 300 చిత్రాలకు పైగా నటించాడు. నర్సింగ్ యాదవ్ హైదరాబాదులో రాజయ్య, లక్ష్మీ నరసమ్మ దంపతులకు జన్మించాడు. హైదరాబాదులోని న్యూ సైన్సు కళాశాలలో ఇంటర్మీడియట్ దాకా చదివాడు. ఆయన భార్య చిత్ర యాదవ్. కుమారుడు రుత్విక్. నర్సింగ్ మొదటి సినిమా విజయ నిర్మల దర్శక నిర్మాతగా వచ్చిన హేమాహేమీలు అనే చిత్రం. నటుడిగా అతనికి బ్రేక్ ఇచ్చింది దర్శకుడు రాం గోపాల్ వర్మ. ఆయన నర్సింగ్ యాదవ్ ఒకే కళాశాలలో చదువుకున్నారు.

సంబంధిత సమాచారం :

X
More