మన స్టార్ హీరోల సినిమా బడ్జెట్ తెలిస్తే మతిపోవాల్సిందే

Published on Mar 20, 2020 7:58 am IST

టాలీవుడ్ మార్కెట్ పరిధి చాలా పెరిగింది. వంద కోట్ల వసూళ్ళు అంటే అవలీలగా లాగేస్తున్నారు. చిరంజీవి, మహేష్, చరణ్, ప్రభాస్ ఇప్పటికే వంద కోట్ల షేర్ సైతం దాటివేశారు. తాజాగా బన్నీ అల వైకుంఠపురంలో మూవీతో వంద కోట్ల క్లబ్ లో చేరాడు. ఈ నేపథ్యంలో ఇక స్టార్ హీరోల నుండి రాబోయే సినిమాలన్నీ భారీ బడ్జెట్ తో తెరకెక్కనున్నాయి. ఎన్టీఆర్ ప్రస్తుతం ఆర్ ఆర్ ఆర్ మూవీలో నటిస్తుండగా దాని బడ్జెట్ 400 కోట్లకు పైగా కలదు. అది పాన్ ఇండియా మూవీ కాబట్టి దాన్ని పక్కన పెట్టినా, త్రివిక్రంతో ఆయన చేయబోయే సినిమా బడ్జెట్ వంద కోట్ల పైనే అని తెలుస్తుంది.

చిరంజీవి-కొరటాల మూవీ బడ్జెట్ సైతం ఉహించినదానికి ఎక్కువగా పెట్టి తెరకెక్కిస్తున్నారని వినికిడి. అల వైకుంఠపురంలో మూవీతో తన మార్కెట్ రేంజ్ ఏంటో చూపించిన అల్లు అర్జున్, సుకుమార్ తో సినిమా చేస్తుండగా దీని కోసం మైత్రి గట్టిగానే ఖర్చుపెట్టనున్నారట. ఇక పాన్ ఇండియా స్టార్ గా ఉన్న ప్రభాస్ ప్రస్తుతం రాధా కృష్ణ దర్శకత్వంలో పీరియాడిక్ లవ్ స్టోరీ చేస్తున్నారు. దీని బడ్జెట్ 150 కోట్లకు పైనే అని తెలుస్తుంది. ఇలా సౌత్ నుండి టాలీవుడ్ స్టార్ హీరోలు భారీ చిత్రాలలో నటిస్తున్నారు.

సంబంధిత సమాచారం :