వాల్మీకి యూనిట్ పై టాలీవుడ్ సానుభూతి

వాల్మీకి యూనిట్ పై టాలీవుడ్ సానుభూతి

Published on Sep 20, 2019 4:40 PM IST

Valmiki4

వరుణ్ తేజ్ హీరోగా దర్శకుడు హరీష్ శంకర్ తెరకెక్కించిన చిత్రం గద్దలకొండ గణేష్ నేడు విడుదలైంది. కాగా విడుదల ముందు రోజు వరకు కూడా వాల్మీకి గా చలామణి అయిన ఈ చిత్ర టైటిల్ చివరి క్షణంలో మార్చాల్సిరావడం చిత్ర యూనిట్ ని షాక్ కి గురిచేసింది. దీనిపై దర్శకుడు మీడియా సాక్షిగా కొంచెం అసహనం వ్యక్తం చేశారు. చివరి నిమిషంలో టైటిల్ మార్చడం వలన ఆడియెన్స్ తికమకకు గురయ్యే అవకాశం కలదు. ఐతే ఈ సంఘటనపై చిత్ర ప్రముఖులు వాల్మీకి చిత్ర యూనిట్ కి మద్దతు ప్రకటించారు.

దర్శకుడు వంశీ పైడిపల్లి, హీరో విజయ్ దేవరకొండ అలాగే మరికొందరు,వాల్మీకి టైటిల్ మార్పు పట్ల విచారం వ్యక్తం చేయడంతో పాటు గద్దలకొండ గణేష్ చిత్రం పెద్ద విజయం సాధించాలని, వారు తెలిపారు. వరుణ్ తేజ్, అధర్వ ప్రధాన పాత్రలు చేసిన ఈ చిత్రంలో పూజా హెగ్డే, మృణాళిని రవి, బ్రహ్మనందం, బ్రహ్మజీ, సత్య, ప్రభాస్ శీను, రచ్చ రవి ఇతర కీలకపాత్రలలో నటించడం జరిగింది. 14రీల్స్ పతాకంపై తెరకెక్కిన ఈ చిత్రానికి సంగీతం మిక్కీ జె మేయర్ అందిచారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు