గాయాలతో టాలీవుడ్ స్టార్స్.. ఆందోళన ఫ్యాన్స్..!

ఇటీవలి కాలంలో టాలీవుడ్ అగ్ర హీరోలు వరుసగా గాయాల బారిన పడటం అభిమానుల్లో ఆందోళన కలిగిస్తోంది. మొదట పవన్ కళ్యాణ్ భుజానికి శస్త్రచికిత్స జరగ్గా, NBK111 షూటింగ్‌లో బాలకృష్ణ మోకాలికి గాయం కావడంతో సర్జరీ చేయించుకున్నారు.

ఇక రామ్ చరణ్ కూడా మణికట్టు గాయంతో కోయంబత్తూరులో, ఎన్టీఆర్ భుజం గాయంతో విశ్రాంతి తీసుకోనున్నారు. మెగా, నందమూరి కుటుంబాల నుంచే చెరో ‘బాబాయ్-అబ్బాయి’ (పవన్-చరణ్, బాలయ్య-ఎన్టీఆర్) జంటగా ఈ గాయాల బారిన పడటం గమనార్హం.

ఈ గాయాల వల్ల పవన్, రామ్ చరణ్, ఎన్టీఆర్ సినిమాల షూటింగ్‌లకు పెద్దగా ఇబ్బంది లేకపోయినా, డిసెంబర్ రిలీజ్ ప్లాన్ చేసుకున్న బాలకృష్ణ NBK111 ప్రాజెక్ట్‌పై మాత్రం కాస్త ప్రభావం పడే అవకాశం ఉంది. ఈ నలుగురు హీరోలు త్వరగా కోలుకోవాలని సినీ వర్గాలు ఆకాంక్షిస్తున్నాయి.

Exit mobile version