ఆసక్తికరంగా రాజేంద్రప్రసాద్ “తోలుబొమ్మలాట” ఫస్ట్ లుక్.

ఆసక్తికరంగా రాజేంద్రప్రసాద్ “తోలుబొమ్మలాట” ఫస్ట్ లుక్.

Published on Jul 19, 2019 11:02 PM IST

నట‌కిరీటి రాజేంద్ర‌ప్ర‌సాద్, విశ్వంత్, వెన్నెల కిషోర్‌, హ‌ర్షిత‌ కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్న చిత్రం `తోలుబొమ్మ‌లాట‌`. సుమ దుర్గా క్రియేష‌న్స్ ప‌తాకంపై దుర్గా ప్ర‌సాద్ మాగంటి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. విశ్వ‌నాథ్ మాగంటి ద‌ర్శ‌కునిగా ప‌రిచ‌య‌మ‌వుతున్నారు. రాజేంద్ర‌ప్ర‌సాద్ జ‌న్మ‌దినాన్ని పుర‌స్క‌రించుకుని `తోలుబొమ్మ‌లాట‌` ఫ‌స్ట్ లుక్ ని నేడు విడుద‌ల చేశారు.

పల్లెటూరి నేపథ్యంలో సాగే కుటుంబ కథా చిత్రంగా ఈ మూవీ తెరకెక్కుతుంది. సాధారణంగా కుటుంబంలోని సభ్యుల మధ్య జరిగే వివాదాలను,ఓ తండ్రి ఎలా చక్కదిద్దారు అనేది ప్రధానాంశంగా దర్శకుడు ఈ చిత్రాన్ని రూపొందించారని సమాచారం. దేవీ ప్ర‌సాద్‌, న‌ర్రా శ్రీనివాస్‌, నారాయ‌ణ రావు, సంగీత‌, క‌ల్ప‌న‌, శిరీష‌, చ‌ల‌ప‌తి రావు, ప్ర‌సాద్ బాబు, ధ‌న‌రాజ్‌, పూజా రామ‌చంద్ర‌న్‌, తాగుబోతు ర‌మేష్‌ తదితరులు ఇతర ప్రధాన పాత్రలలో కనిపించనున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు