‘ఒడిస్సి’ పై టామ్ క్రూయిజ్ రివ్యూ.. మళ్ళీ షో పడాల్సిందే అంటున్న ‘డిగ్గర్’

‘ఒడిస్సి’ పై టామ్ క్రూయిజ్ రివ్యూ.. మళ్ళీ షో పడాల్సిందే అంటున్న ‘డిగ్గర్’

Published on Jul 17, 2026 12:45 PM IST

ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ఆడియెన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రమే ‘ఒడిస్సి’. దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్ ఒక్కడి పేరు తోనే ప్రపంచ వ్యాప్తంగా ఓ రేంజ్ క్రేజ్ సంతరించుకున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ ఇప్పుడు భారీ ఎత్తున విడుదలకి వచ్చింది. మన దేశంలో కూడా ఈ సినిమాకి విపరీతమైన క్రేజ్ వచ్చింది. ఇలా పాన్ ఇండియా భాషల్లో విడుదల కాగా ఆల్రెడీ సాలిడ్ రివ్యూస్ కూడా ఈ చిత్రానికి పడ్డాయి.

అయితే లేటెస్ట్ గా ప్రముఖ హాలీవుడ్ స్టార్ నటుడు టామ్ క్రూయిజ్ ఒడిస్సి సినిమా చూసి తన ఎగ్జైట్మెంట్ పంచుకున్నారు. ఒడిస్సి సినిమాకి నోలన్ వర్క్ వావ్ అనిపించే రేంజ్ లో ఉందని మొత్తం మీ నటీనటులు,సాంకేతిక నిపుణులు అంతా అదరగొట్టేశారని నాకు ఒక అమేజింగ్ రాత్రి అందించినందుకు థాంక్స్, మళ్ళీ ఇంకో చూడాల్సిందే అంటూ సాలిడ్ రివ్యూ ఇవ్వడం ఇపుడు ఫ్యాన్స్ లో తన పోస్ట్ వైరల్ గా మారింది. ఇక రీసెంట్ గానే టామ్ తన ‘డిగ్గర్’ ట్రైలర్ తో అందరినీ ఆశ్చర్యపరిచిన సంగతి తెలిసిందే.

తాజా వార్తలు