రేపటితో చైతు ‘లవ్ స్టోరీ’కి ప్యాకప్ !

Published on Sep 27, 2020 10:29 pm IST

మజిలీ, వెంకీమామ లాంటి సూపర్ హిట్స్ తో మంచి ఫామ్ లో ఉన్న నాగచైతన్య హీరోగా చేస్తోన్న సినిమా లవ్ స్టోరీ. ఫిదాతో తెలుగు ప్రేక్షకులను ఫిదా చేసిన నేచురల్ బ్యూటీ సాయిపల్లవి ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుండటం కూడా ఈ సినిమా పై అంచనాలను రెట్టింపు చేసింది. దాదాపు మొత్తం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా మిగిలిన బ్యాలెన్స్ షూటింగ్ ను కూడా రేపటితో పూర్తి కానుంది. ప్రభుత్వం చెప్పినట్లుగానే అన్ని నియమనిబంధనలకు అనుగుణంగానే షూట్ చేస్తున్నారు. ఇక వచ్చే నెల మొదటి వారం కల్లా ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలన్ని పూర్తవుతాయట.

శేఖర్ కమ్ముల ఫిదా తర్వాత ఎలాంటి కథతో వస్తాడా అని అందరిలో ఆసక్తి ఉన్న సమయంలో ఆ ఆసక్తిని డబుల్ చేస్తూ క్రేజీ కాంబినేషన్ తో ‘లవ్ స్టోరీ’ సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. కాగా డిస్ట్రిబ్యూటర్స్ గా ఇప్పటి వరకూ వందలాది సినిమాలను రిలీజ్ చేసిన ఏసియన్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఈ చిత్రంతో ఫస్ట్ టైమ్ నిర్మాణ రంగంలోకి అడుగు పెడుతుంది. కాగా నారాయణ్ దాస్ కె నారంగ్, పి రామ్మోహన్ రావు నిర్మిస్తున్నారు. అక్కినేని అభిమనుల్లో, అలాగే ప్రేక్షకుల్లో ఈ సినిమా పై బాగానే అంచనాలు ఉన్నాయి.

సంబంధిత సమాచారం :

More