రేపు “హరిహర వీరమల్లు” నుండి ఫ్యాన్స్ కి ట్రీట్!

Published on Sep 1, 2023 9:36 pm IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ టైటిల్ రోల్ లో, టాలెంటెడ్ డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం లో తెరకెక్కుతున్న పీరియడ్ యాక్షన్ ఎంటర్టైనర్ హరిహర వీరమల్లు. ఈ చిత్రం షూటింగ్ లో జాప్యం జరుగుతూనే ఉంది. అయితే సెప్టెంబర్ 2 న పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా మేకర్స్ రేపు పోస్టర్ ను విడుదల చేయనున్నారు. తాజాగా మేకర్స్ దీనిపై సరికొత్త ప్రకటన చేయడం జరిగింది.

మెగా సూర్య ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మిస్తున్న ఈ చిత్రం లో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా, ఆస్కార్ అవార్డు విన్నర్ ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం కి సంబందించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.

సంబంధిత సమాచారం :