ఈ ఏడాది హిందీలో టాప్ 5 చిత్రాలు ఇవే !

Published on Dec 25, 2018 5:19 pm IST

బాలీవుడ్ అగ్ర హీరోలకు 2018 కలిసిరాలేదని చెప్పాలి. షారుక్ ఖాన్ , అమీర్ ఖాన్ ఈ ఏడాది భారీ పరాజయాలను చవిచూశారు. భారీ అంచనాలతో వారు నటించిన సినిమాలు బాక్సాఫిస్ వద్ద బోర్లాపడ్డాయి. అందులో అమీర్ ఖాన్ నటించిన ‘థగ్స్ అఫ్ హిందుస్థాన్’ అలాగే షారుక్ నటించిన ‘జీరో’ చిత్రాలు భారీ హైప్ తో విడుదలై ప్రేక్షకులను మెప్పించలేకపోయాయి. ఇక సల్మాన్ ఖాన్ నటించిన ‘రేస్ 3’ మిక్సడ్ రివ్యూస్ ను తెచ్చుకున్నా మంచి కలెక్షన్స్ ను రాబట్టింది.

అయితే ఓవరాల్ గా హిందీ లో ఈ ఏడాది సక్సెస్ రేట్ తక్కువగానే వున్నా కొన్ని చిత్రాలు మాత్రం బాక్సాఫిస్ వద్ద సత్తాచాటాయి. అందులో యంగ్ హీరో రణబీర్ కపూర్ నటించిన ‘సంజు’ ఈ ఏడాది బాలీవుడ్ లో సూపర్ డూపర్ హిట్ అయ్యి కలెక్షన్ల పరంగా టాప్ ప్లేస్ ను దక్కించుకుంది.

టాప్ 5 హిందీ మూవీస్ (ఇండియన్ బాక్సాఫీస్ )

సంజు

పద్మావత్

2.0

రేస్ 3

భాగి 2

సంబంధిత సమాచారం :