2018 యూఎస్ఏ లో టాప్ 5 టాలీవుడ్ మూవీస్ ఇవే !

Published on Dec 26, 2018 12:06 pm IST

టాలీవుడ్ కి ఈ ఏడాది బాగానే కలిసివచ్చిందని చెప్పాలి. స్టార్ హీరోలు నటించిన సినిమాలు ఈ ఏడాది విడుదలై బాక్సాఫిస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించాయి. ఇక ఈ చిత్రాలు అటు అమెరికాలో కూడా మంచి వసూళ్లను రాబట్టాయి. ఈ ఏడాది అక్కడ అత్యధిక కలెక్షన్లు రాబట్టిన చిత్రం గా ‘రంగస్థలం’ మొదటి స్థానంలో నిలిచింది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన ఈ చిత్రం మార్చి లో విడుదలై బాక్సాఫిస్ ను షేక్ చేసింది. ఈచిత్రం తరువాత సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ‘భరత్ అనే నేను’ అలాగే కీర్తి సురేష్ నటించిన ‘మహనటి’ విడుదలై ఇండియాతో పాటు అమెరికాలో కలెక్షన్ల వర్షం కురిపించాయి. మహానటి , రంగస్థలం ఇండియాలో ఈ ఏడాది అత్యంత ప్రజాదరణ పొందిన టాప్ 10 చిత్రాల్లో ప్లేస్ దక్కించుకున్నాయి.

ఇక వీటితోపాటు యంగ్ హీరో విజయ్ దేవరకొండ నటించిన ‘గీత గోవిందం’ అలాగే యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన ‘అరవింద సమేత’ చిత్రాలు యూఎస్ఏ లో మంచివసూళ్లను రాబట్టాయి.

2018 కి గాను యుఎస్ఏ లో టాప్ 5 టాలీవుడ్ మూవీస్ !

రంగస్థలం – $3,513,450

భరత్ అనే నేను – $3,416,451

మహానటి – $2,543,515

గీత గోవిందం – $2,465,367

అరవింద సమేత – $2,181,943

సంబంధిత సమాచారం :