మహేష్ బాబు ప్రస్తుతం నటిస్తున్న తన తదుపరి చిత్రం ‘శ్రీమంతుడు’ షూటింగ్ శరవేగంగా సాగుతుంది. ఈ సినిమాను ‘మిర్చి’తో విజయం సాధించిన కొరటాల శివ తెరకెక్కిస్తున్నాడు. జగపతిబాబు, రాజేంద్ర ప్రసాద్ మరియు సుకన్య ముఖ్యపాత్రధారులు. శృతిహాసన్ ఒక నాయికగా అలరించనుంది.
తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో రెండో హీరోయిన్ నిఖరారు చేసారట. బెంగాళీ భామ అంగనా రాయ్ ని ఆడిషన్ లు నిర్వహించి ఎంపిక చేసుకున్నారట. దాదాపు 70మందిని పరిశీలించాక ఈ భామను ఖరారు చేసినట్టు తెలుస్తుంది. ఈ వార్త తెలియగానే ముద్దుగుమ్మ ఆనందంతో మహేష్ తో నటించడం తన అదృష్టమని తెలిసింది.
మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో పాటలకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించనున్నారు


