బాలీవుడ్ స్టార్స్ చేతిలో ‘జెర్సీ’ !

Published on Jun 25, 2019 11:53 am IST

ఈ మధ్య కాలంలో విడుదలైన సినిమాల్లో డీసెంట్ టాక్ తో ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్న చిత్రాల్లో ‘జెర్సీ’ ముందు వరుసలో ఉంటుంది. గౌతమ్ దర్శకత్వంలో నాని హీరోగా నటించిన ఈ స్పోర్ట్స్ డ్రామా నాని కెరీర్ లోనే బెస్ట్ మూవీగా నిలిచింది. అందుకే ‘జెర్సీ’ సాధారణ ప్రేక్షకులతో పాటు ఇండస్ట్రీలోని సినీ ప్రముఖులను కూడా బాగా మెప్పించింది.

కాగా తాజా సినీ వర్గాల సమాచారం ప్రకారం ప్రముఖ బాలీవుడ్ చిత్ర నిర్మాత కరణ్ జోహార్ ‘జెర్సీ’ యొక్క హిందీ రీమేక్ హక్కులను సొంతం చేసుకున్నారు. ఈ రీమేక్‌ కు గౌతమ్ తిన్ననూరి స్వయంగా దర్శకత్వం వహించనున్నారని తెలుస్తోంది. అలాగే హిందీ వెర్షన్‌ లో నాని పాత్రలో షాహిద్ కపూర్ కనిపించబోతున్నారని సమాచారం. మొత్తానికి జెర్సీ బాలీవుడ్ స్టార్స్ చేతిలో వెళ్ళింది. అయితే ఈ రీమేక్ కి సంబంధించి ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

సంబంధిత సమాచారం :

X
More