సినిమాల్లోకి రాబోతున్న సీనియర్ నటుడు కుమారుడు !

Published on Jul 11, 2018 2:19 pm IST

విలక్షణ నటుడుతో పాటుగా బహుభాషా నటుడుగా నాజర్‌ ఎంతో పేరుప్రఖ్యాతలు తెచ్చుకున్నారు. పైగా ఆయన జాతీయ అవార్డు గ్రహీత కూడా. ఇప్పటికే నాజర్ చాలా చిత్రాల్లో నటించారు. ఆయన పెద్ద కుమారుడు కూడా సినిమాల్లోనే ఉన్నారు.

కాగా, తాజా సమాచారం ప్రకారం ఇప్పుడు నాజర్ చిన్న కుమారుడు అబీ మెహిదీ కూడా సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు. తన మొదటి సినిమాని తమిళంలో చేస్తున్నారు. రాజ్ కమల్ ఫిల్మ్ స్ ఈ చిత్రాన్ని నిర్మించబోతుంది. ఈ ప్రాజెక్ట్ కోసం అక్షర హాసన్ తో మరియు చిత్రబృందంతో కలిసి అబీ పాల్గొంటున్నారు. ఐతే త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించి అధికారిక ప్రకటన రానుంది.

సంబంధిత సమాచారం :

X
More