‘జాన్’ ఫుల్ ఎంటర్ టైనర్ గా ?

Published on Sep 19, 2019 1:41 am IST

ప్ర‌భాస్ హీరోగా అత్యంత భారీ బ‌డ్జెట్ తో హై స్టాండ‌ర్డ్స్ టెక్నాల‌జీతో తెరెకెక్కిన ‘సాహో’ సినిమా నెగిటివ్ టాక్ ను సొంతం చేసుకున్నా బాక్సాఫీస్ వద్ద పర్వాలేదనిపించుకుంది. అయితే ఇక ప్రభాస్ తన తరువాత సినిమా ‘జాన్’ పై చాల జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. స్క్రిప్ట్ ను మళ్లీ ఒక్కసారి మొత్తం సరి చూసుకోమని ఇప్పటికే దర్శకుడికి చెప్పినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా జాన్ ను ఫుల్ ఎంటర్ టైనర్ గా మలచాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. వెన్నెల కిషోర్ రోల్ కి సంబధించిన సీన్స్ చాల బాగా అలరిస్తాయని తెలుస్తోంది. అలాగే సినిమాలో రొమాంటిక్ సీన్స్ కూడా ఆకట్టుకుంటాయట. జిల్ చిత్రాన్ని తెరకెక్కించిన ద‌ర్శ‌కుడు రాధాకృష్ణ‌ తెరకెక్కిస్తోన్న ఈ పీరియాడిక్‌ రొమాంటిక్ ఎంటర్టైనర్ ఓ థ్రిల్లింగ్ ప్రేమకథ. పైగా 1960 కాలంలో ఈ కథ సాగుతుంది,

మూడు భాషల్లో తెరకెక్కనున్న ఈ చిత్రాన్నీ గోపికృష్ణ మూవీస్ , యువీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. 2020 చివ‌ర్లో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి చిత్ర బృందం సన్నాహాలు చేస్తుంది. ఇక అత్యంత భారీ బ‌డ్జెట్ తో హై స్టాండ‌ర్డ్స్ టెక్నాల‌జీతో తెరెకెక్కిన్న ‘సాహో’ చిత్రం నెగిటివ్ టాక్ తో బాక్సాఫీస్ వద్ద బలమైన ఓపెనింగ్స్ సాధించి.. ప్రభాస్ స్టార్ డమ్ ఏంటో చూపించింది.

సంబంధిత సమాచారం :

X
More