ప్రకాష్ రాజ్ సినిమా ఆడియో లాంచ్‌కు టాప్ స్టార్స్..!

mana-oori
తన విలక్షణ నటనతో ఎలాంటి పాత్రనైనా రక్తికట్టించగల నటుడు ప్రకాశ్ రాజ్, నిర్మాతగా, దర్శకుడిగానూ అద్భుతమైన ఖ్యాతి గడించిన విషయం తెలిసిందే. తాజాగా ఆయన స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన ‘మన ఊరి రామాయణం’ అన్న సినిమా కొద్దిరోజులుగా మంచి ఆసక్తి కలిగిస్తూ వస్తోంది. ఈమధ్యే విడుదలైన టీజర్‌కు ఊహించని స్థాయి రెస్పాన్స్ రావడంతో హ్యాపీ అయిన ప్రకాష్ రాజ్, అక్టోబర్ నెల 7న దసరా కానుకంగా సినిమాను ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

అదేవిధంగా ఈ సినిమా ఆడియో ఆవిష్కరణ వేడుకను నేడు హైద్రాబాద్‌లోని డస్పాల్లా హోటల్లో నిర్వహించనున్నారు. కింగ్ అక్కినేని నాగార్జునతో పాటు టాప్ స్టార్ డైరెక్టర్స్ త్రివిక్రమ్, సుకుమార్, గుణశేఖర్ తదితరులు ఈ వేడుకకు హాజరు కానున్నారు. తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో ఏకకాలంలో షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా ప్రకాష్ రాజ్ గత చిత్రాల్లానే సహజమైన భావోద్వేగాలకు పెద్ద పీట వేసినట్లు తెలుస్తోంది.