పవర్ స్టార్ సినిమాకు ముగ్గురు దర్శకులా.?

Published on Aug 13, 2020 10:30 am IST

చాలా కాలం తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మళ్ళీ సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తే ఆ చిత్రం విడుదల అయ్యేలోపు ఫ్యాన్స్ ఆనందానికి కరోనా బ్రేక్ వేసింది. దీనితో వారికి కూడా ఎదురు చూపులు తప్పలేదు. శ్రీరామ్ వేణు దర్శకత్వంలో మొదలు పెట్టిన పింక్ రీమేక్ చిత్రం “వకీల్ సాబ్” కు ఇంకా కొంత షూటింగ్ బ్యాలన్స్ ఉంది. ఇక దీని తర్వాత పవన్ అధికారికంగా మరో రెండు ప్రాజెక్టులను చేస్తున్న సంగతి తెలిసిందే.

ఇప్పుడు ఈ మూడు సినిమాల తర్వాత చెయ్యబోయే సినిమా పై మాత్రమే అనేక కథనాలు వినిపిస్తున్నాయి. పవర్ స్టార్ రీఎంట్రీ ఇచ్చాక సరిగ్గా మూడు చిత్రాల అనంతరం చెయ్యబోయే సినిమాకు చాలా మంది దర్శకుల పేర్లే వినిపించినా మొత్తం ముగ్గురు టాప్ దర్శకుల పేర్లు వినిపిస్తుండడం గమనార్హం.

మొదటగా పవర్ స్టార్ క్రేజీ కాంబో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ పేరు వినిపించగా ఆ తర్వాత మరో ఇంటెలిజెంట్ దర్శకుడు సుకుమార్ పేరు వినిపించింది. ఇక అదీ అయ్యాక లేటెస్ట్ ఇప్పుడు మరో టాప్ దర్శకుడు సురేందర్ రెడ్డి పేరు గట్టిగా వినిపించడం మొదలయ్యింది. దీనితో పవన్ ఈ సినిమా ఏమో కానీ ఈ రూమర్స్ మాత్రం గట్టిగా వినిపిస్తున్నాయి. మరి పవన్ ఎవరితో సినిమా ఓకే చేస్తారో చూడాలి.

సంబంధిత సమాచారం :

More