
వరల్డ్ కప్ ఫీవర్ ఓవైపు.. ఇంటరెస్టింగ్ కాన్సెప్ట్ లతో తెరకెక్కిన సినిమాలు మరోవైపు.. వెరసి ఈ వీకెండ్ ఎంటర్టైన్మెంట్ కోరుకునే తెలుగు ప్రేక్షకులకు వినోదం అందించడానికి రెడీ అయ్యాయి. ఈ శుక్రవారం బాక్సాఫీస్ బరిలో 5 మీడియం బడ్జెట్ సినిమాలు తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి రెడీ అయ్యాయి.
‘జీనియస్’ ఫేం హవీష్ నటించిన ‘రామ్ లీల’, నవదీప్, నవీన్ చంద్రల మల్టీస్టారర్ ‘భం బోలేనాథ్’, తమిళంలో హిట్టయిన విశాల్, హన్సికల ‘మగ మహారాజు’, హారర్ కామెడీ పిశాచిలు శుక్రవారమే విడుదలవుతున్నాయి. ముఖ్యంగా ‘రామ్ లీల’, ‘భం బోలేనాథ్’ సినిమాల ప్రమోషన్ కార్యక్రమాలు వినూత్నంగా చేస్తున్నారు. వీటిపై ప్రేక్షకులలో మంచి క్రేజ్ ఏర్పడింది. ఈ నాలుగు సినిమాలతో పాటు జై ఆకాష్ ‘అనందం మళ్లీ మొదలైంది’ సినిమాతో హిట్ అందుకోవాలని ట్రై చేస్తున్నాడు. శుక్రవారమే తన సినిమాను విడుదల చేస్తున్నాడు.