ఒక్క “వకీల్ సాబ్” ట్రైలర్ తో మొత్తం పరిస్థితే మార్చేశారుగా.!

Published on Mar 30, 2021 3:00 pm IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన లేటెస్ట్ చిత్రం “వకీల్ సాబ్”. తెలుగు బాక్సాఫీస్ దగ్గర గాని ఓవర్సీస్ మార్కెట్ లో కానీ పవన్ సినిమా హవా ఎలా ఉండేదో తన గత చిత్రాల రిలీజ్ లు గుర్తు చేసుకుంటే తెలుస్తుంది. మరి అవన్నీ దూరమయ్యిపోయి మూడేళ్లు గడిచిపోయింది. సరే మళ్ళీ ఎలాగో పవన్ రీఎంట్రీ ఇస్తున్నాడన్న వార్త కాస్త హైప్ ను మళ్ళీ తీసుకొచ్చింది. కానీ రీమేక్ తో వస్తున్నాడని తెలియగానే మళ్ళీ అదే రొటీన్ లైనప్ అన్న టాక్ వచ్చింది.

కానీ అక్కడున్నది పవన్ కళ్యాణ్ పైగా సినిమాను డీల్ చేస్తుంది కూడా పవన్ కి వీరాభిమానులు కావడంతో ఈ సినిమా ఒక్కో దశలో ఒక్కో రకంగా మారింది. గత లాక్ డౌన్ లో అయితే స్ట్రైట్ ఓటిటి రిలీజ్ కి ఇచ్చేస్తే బెటర్ అనే అభిమానులే ఇప్పుడు థియేట్రికల్ రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్నారు. మరి ఇదంతా ఒక్క “వకీల్ సాబ్” ట్రైలర్ దానిని రీచ్ చెయ్యడానికి ప్లాన్ చేసిన దిల్ రాజు మరియు దర్శకుడు టీం కు దక్కుతుంది అని చెప్పాలి.

అసలు పవన్ కెరీర్ లోనే ఏ సినిమా ట్రైలర్ కు రాని రెస్పాన్స్ “వకీల్ సాబ్” ట్రైలర్ కు వచ్చింది. ఎన్నో ఏళ్లుగా చెదరని రికార్డులు పాన్ ఇండియన్ సినిమాల రికార్డులు యూట్యూబ్ లో బద్దలుకొట్టి పవన్ స్టామినా ప్రూవ్ చేసాడు. కేవలం వ్యూస్ పరంగానే కాకుండా లైక్స్ లో కూడా సెన్సేషన్ ను ఇది నమోదు చేసింది. ఇక అలాగే థియేటర్స్ లో వచ్చిన రెస్పాన్స్ కూడా వేరే లెవెల్ అని చెప్పాలి.

ఇవే అనుకుంటే ఓవర్సీస్ లో భారీ ఎత్తున విడుదలకు రెడీ అవుతుండడం గమనార్హం.. దీనితో అసలు అంతగా హైపే లేని స్థాయి నుంచి ఇప్పుడు వరల్డ్ వైడ్ గా మాస్ ఓపెనింగ్స్ దక్కించుకునే స్టేట్ కు వకీల్ సాబ్ వచ్చేసింది. చివరి నిమిషంలో పవన్ ఇమేజ్ నిర్మాత దిల్ రాజు పర్ఫెక్ట్ ప్లానింగ్స్ అలాగే దర్శకుడు వేణు శ్రీరామ్ టేకింగ్ పెను మార్పులు తీసుకొచ్చాయి. ఇక్కడ మరో స్పెషల్ మెన్షన్ సంగీత దర్శకుడు థమన్ కి కూడా ఇవ్వవలసి ఉంది.

సంబంధిత సమాచారం :