విడుదల కోసం గొడవ తప్పేలా లేదే..!

Published on Mar 22, 2020 3:00 am IST

టాలీవుడ్ లో అనేక సినిమాలు కరోనా వైరస్ కారణంగా విడుదల వాయిదా వేసుకున్నాయి. ప్రభుత్వాలు మార్చి 31 వరకు థియేటర్స్ బంద్ ప్రకటించడంతో పాటు, ప్రజలు సైతం భయపడుతుండడంతో థియేటర్స్ వెల వెల బోతున్నాయి.ఇక ఇప్పటికే టాలీవుడ్ కి చెందిన అరడజను పెద్ద సినిమాలు విడుదల వాయిదా వేసుకున్నాయి. వాటిలో అనుష్క నటించిన నిశ్శబ్దం, రానా హీరోగా వస్తున్న పాన్ ఇండియా మూవీ అరణ్య లతో పాటు, నాని, సుధీర్ ల వి, నాగ చైతన్య లవ్ స్టోరీ వంటివి వున్నాయి.

వీటితో పాటు చాల చిన్న సినిమాల విడుదల ఆగిపోయింది. ఈ నేపథ్యంలో కరోనా వైరస్ ప్రభావం తగ్గిన వెంటనే ఈ చిత్రాలన్నీ విడుదలకు క్యూ కట్టే పరిస్థితి ఉంది. దీని వలన థియేటర్స్ సమస్య తలెత్తడం ఖాయంగా కనిపిస్తుంది. మరి ఈ పరిస్థితిని దర్శక నిర్మాతలు, హీరోలు ఎలా మేనేజ్ చేస్తారో చూడాలి.

సంబంధిత సమాచారం :

X
More