Toxic: మాల్స్ నుంచి మెట్రో రైళ్ల వరకు.. దేశవ్యాప్తంగా మొదలైన రాకింగ్ స్టార్ యష్ ‘టాక్సిక్’ ప్రమోషన్లు

Toxic: మాల్స్ నుంచి మెట్రో రైళ్ల వరకు.. దేశవ్యాప్తంగా మొదలైన రాకింగ్ స్టార్ యష్ ‘టాక్సిక్’ ప్రమోషన్లు

Published on Aug 18, 2026 8:04 PM IST

నటుడు యష్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా పాన్-ఇండియా చిత్రం ‘టాక్సిక్’ (Toxic – A Fairy Tale for Grown-ups). ఈ సినిమాకు గీతు మోహన్‌దాస్ దర్శకత్వం వహిస్తుండగా, కేవీఎన్ ప్రొడక్షన్స్, మాన్‌స్టర్ మైండ్ క్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. విడుదల తేదీ సమీపిస్తుండటంతో దేశవ్యాప్తంగా ప్రచార కార్యక్రమాలు ఊపందుకున్నాయి.

దేశంలోని ప్రధాన నగరాల్లో ‘టాక్సిక్’ ప్రమోషన్లను వినూత్నంగా నిర్వహిస్తున్నారు. ప్రముఖ షాపింగ్ మాల్స్, మల్టీప్లెక్స్ థియేటర్ లాబీలతో పాటు పలు నగరాల్లోని మెట్రో రైళ్లపై సినిమా పోస్టర్లు, ప్రచార చిత్రాలను ప్రదర్శిస్తున్నారు.

ఈ చిత్రాన్ని ఆగస్టు 26న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయనున్నట్లు నిర్మాతలు స్పష్టం చేశారు. విడుదల సమయం దగ్గర పడుతుండటంతో మేకర్స్ ప్రచార కార్యక్రమాలను మరింత ముమ్మరం చేస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు