అఫీషియల్ : ‘టాక్సిక్’ డే 1 వరల్డ్‌వైడ్ కలెక్షన్స్.. ప్యూర్ ర్యాంపేజ్..!

అఫీషియల్ : ‘టాక్సిక్’ డే 1 వరల్డ్‌వైడ్ కలెక్షన్స్.. ప్యూర్ ర్యాంపేజ్..!

Published on Aug 27, 2026 5:12 PM IST

Toxic-Movie

రాకింగ్ స్టార్ యష్ నటించిన మోస్ట్ అవైటెడ్ పాన్-ఇండియా చిత్రం ‘టాక్సిక్: ఏ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్’ బాక్సాఫీస్ వద్ద ప్రపంచవ్యాప్తంగా అద్భుతమైన ఓపెనింగ్స్ సాధించింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం మొదటి రోజే రూ.150 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించి థియేటర్ల వద్ద తన సత్తా చాటింది.

యష్ మాస్ క్రేజ్, యాక్షన్ ఎపిసోడ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకోవడంతో థియేటర్లు పండగ వాతావరణాన్ని సంతరించుకున్నాయి. విడుదలైన అన్ని ప్రాంతాల్లోనూ ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ లభిస్తోందని చిత్ర యూనిట్ చెబుతోంది. ముఖ్యంగా నార్త్ బెల్ట్‌తో పాటు సౌత్ మార్కెట్లలో కూడా భారీ కలెక్షన్లు నమోదయ్యాయి.

కొంతమంది విమర్శకుల నుంచి మిక్సిడ్ రెస్పాన్స్ వ్యక్తమైనప్పటికీ, యష్ రాకింగ్ పెర్ఫార్మెన్స్ మరియు స్క్రీన్ ప్రెజెన్స్ కారణంగా మొదటి రోజే ఈ స్థాయి బాక్సాఫీస్ విధ్వంసం సాధ్యమైందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఇక ఈ వీకెండ్‌లో కూడా ఈ వసూళ్ల సునామీ కొనసాగే అవకాశం కనిపిస్తోందని సినీ సర్కిల్స్ చెబుతున్నాయి. నయనతార, కియారా అద్వానీ, రుక్మిణి వసంత్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటించిన ఈ చిత్రాన్ని గీతూ మోహన్‌దాస్ డైరెక్ట్ చేయగా కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్ ప్రొడ్యూస్ చేశారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు