ట్రేడ్ టాక్: డే 2 కూడా షాకింగ్ నెంబర్స్ తో ‘పెద్ది’

ట్రేడ్ టాక్: డే 2 కూడా షాకింగ్ నెంబర్స్ తో ‘పెద్ది’

Published on Jun 6, 2026 7:04 AM IST

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన తాజా చిత్రం పెద్ది ఎట్టకేలకు టాలీవుడ్ ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న సాలిడ్ బాక్సాఫీస్ హిట్ గా అవతరిస్తున్న సంగతి తెలిసిందే. ప్రీమియర్స్ నుంచి డే 2 వరకు సెన్సేషన్ గా నిలిచిన ఈ సినిమా డే 2 కూడా భారీ నెంబర్స్ సెట్ చేసినట్టు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఒక్క ఇండియా లోనే కాకుండా వరల్డ్ వైడ్ గా కూడా సినిమా సాలిడ్ డే 2 చూసినట్టు తెలుస్తోంది.

ఇక మన తెలుగు రాష్ట్రాల్లో అయితే పెద్ది రెండో రోజు షాకింగ్ నెంబర్స్ పెట్టునట్టు తెలుస్తోంది. మరీ ముఖ్యంగా మెగా కుటుంబానికి బాగా పట్టు ఉన్న ఉత్తరాంధ్ర ప్రాంతంలో పెద్ది భారీ రెవెన్యూ జెనరేట్ చేస్తున్నట్టు ట్రేడ్ టాక్. సో ఇలా మొత్తానికి పెద్ది సినిమా భారీ వీకెండ్ పై కన్నేసింది అని చెప్పవచ్చు. ఇక ఈ సినిమాకి ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందించారు. అలాగే వృద్ది సినిమాస్ నిర్మాణం వహించిన సంగతి తెలిసిందే.

తాజా వార్తలు