సామీ స్క్వేర్ ట్రైలర్ ఎలావుందంటే !
Published on Jun 3, 2018 12:41 pm IST

చియాన్ విక్రమ్,కీర్తి సురేష్ జంటగా తమిళ భాషలో తెరకెక్కుతున్న చిత్రం ‘సామీ స్క్వేర్’.తాజాగా కొద్దీ సేపటి క్రితం ఈ చిత్ర ట్రైలర్ ని రిలీజ్ చేశారు. పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో విక్రమ్ అదరగొట్టనున్నాడని తెలుస్తుంది. యాక్షన్ సినిమాలని తెరకెక్కిన్చడంలో మంచి పట్టున్న హరి మరొకసారి అదే ఫార్ములా తో వస్తున్నాడు.

ట్రైలర్ మాత్రం మాస్ జనాలకి బాగా నచ్చుతుంది . విలన్ పాత్రలో నటిస్తున్న బాబీ సింహ డిఫరెంట్ లుక్స్ లో కనిపిస్తున్నాడు. ఈ సినిమాలో హీరోకి విలన్ కి మధ్య పోరు ఆసక్తికరంగా ఉండనున్నట్లు తెలుస్తుంది. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ ఈ చిత్రానికి హైలైట్ అవ్వనుంది .

ఈ ట్రైలర్ తో చిత్రం ఫై వున్నా అంచనాలను అమాంతం పెంచేసాడు డైరెక్టర్ హరి.రాజస్థాన్ ,ఢిల్లీ మొదలగు ప్రదేశాల్లో షూటింగ్ జరుపుకున్న ఈ చిత్రం తెలుగులో ‘సామి’ పేరుతో విడుదల కానుంది . ఈ చిత్ర తెలుగు వెర్షన్ ట్రైలర్ ను తొందర్లోనే విడుదల చేయనున్నారు.

ట్రైలర్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  • 7
  •  
  •  
  •  

 
Subscribe to our Youtube Channel
 
Like us on Facebook