‘యు టర్న్’ ట్రైలర్ ఆ రోజే విడుదలకానుంది !

‘యు టర్న్’ ట్రైలర్ ఆ రోజే విడుదలకానుంది !

Published on Aug 11, 2018 9:59 PM IST

U turn
ఈ ఏడాది వరుస విజయాలను సొంతం చేసుకొని టాప్ హీరోయిన్ గా దూసుకుపోతుంది ప్రముఖ హీరోయిన్ సమంత అక్కినేని. ఆమె నటిస్తున్న తాజా చిత్రం యు టర్న్. తెలుగు , తమిళ భాషల్లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఆమె జర్నలిస్టు పాత్రలో కనిపించనుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈచిత్రం సెప్టెంబర్ 13న రెండు భాషల్లో ఒకే సారి విడుదల కానుంది. కన్నడలో విజయం సాధించిన యు టర్న్ చిత్రానికి రీమేక్ గా వస్తున్న ఈ చిత్ర్రాన్నీ ఒరిజినల్ వెర్షన్ ని తెరకెక్కించిన పవన్ కుమారే తెరకెక్కిస్తున్నాడు.

సస్పెన్స్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో భూమిక , అది పినిశెట్టి , రాహుల్ రవీంద్రన్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఇక ఈ చిత్రం యొక్క ట్రైలర్ ను ఈనెల 17న విడుదల చేయనున్నారు. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ పతాకం ఫై శ్రీనివాస్ చిట్టూరి నిర్మిస్తున్న ఈచిత్రానికి పూర్ణ చంద్ర తేజస్వి సంగీతం అందిస్తున్నారు.

తాజా వార్తలు