ఆ సినిమా ట్రైలర్ విడుదలకావట్లేదు !

ఆ సినిమా ట్రైలర్ విడుదలకావట్లేదు !

Published on Aug 25, 2018 11:05 AM IST

nartanashalla1

‘ఛలో’ సినిమాతో కెరీర్ లో సూపర్ హిట్ ను అందుకున్నయువ హీరో నాగ శౌర్య ఇటీవల ‘కణం, అమ్మమ్మగారిల్లు చిత్రాలతో ప్రేక్షకులముందుకు వచ్చాడు. ఈ రెండు చిత్రాలు కూడా విజయాన్ని సాధించలేకపోయాయి. ఈచిత్రాల ఫలితాలను ముందే అంచనా వేసిన నాగశౌర్య వాటికీ సంభందించిన ప్రమోషన్స్ కు కూడా హాజరు కాలేదు.

ఇక ఇప్పుడు ఆయన చాలా ఆశలు పెట్టుకుని తాజాగా నటిస్తున్న చిత్రం ‘@నర్తనశాల’. నూతన దర్శకుడు శ్రీనివాస్ ఈచిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఇక ఇటీవల విడుదల చేసిన ఈ చిత్ర వీడియో సాంగ్ ప్రోమోలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే సినిమా విడుదలకు సమయం దగ్గర పడుతున్న ఈ చిత్ర ట్రైలర్ ను ఇంకా విడుదలచేయలేదు. నిన్న జరిగిన ఈచిత్ర ప్రీ రిలీజ్ వేడుకలో అయినా విడుదల చేస్తారనుకుంటే అక్కడ కూడా చేయలేదు.

ఇక ఇప్పుడు డైరెక్ట్ గా సినిమాను ఆగస్టు 30న విడుదల చేసిన తరువాత ట్రైలర్ ను రిలీజ్ చేస్తారని సమాచారం. కాశ్మీర ప్రదేశి, యామిని భాస్కర్ కథానాయికలుగా నటిస్తున్న ఈచిత్రాన్ని ఐర క్రియేషన్స్ నిర్మిస్తుంది. ‘ఛలో’ ఫెమ్ మహతి స్వర సాగర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.

తాజా వార్తలు