సుధీర్ బాబు సినిమా ట్రైలర్ టైగర్ ష్రాఫ్ విడుదల చేయనున్నాడు !

Nannudochu

‘సమ్మోహనం’ చిత్రం తరువాత హీరో సుధీర్ బాబు ఆయన హోమ్ ప్రొడక్షన్స్ లో నటించిన చిత్రం ‘నన్ను దోచుకుందువటే’. నూతన దర్శకుడు ఆర్ ఎస్ నాయుడు తెరకెక్కించిన ఈ చిత్రంలో నాబా నటేష్ కథానాయికగా నటించింది. ఈచిత్రం సెప్టెంబర్ 21న ప్రేక్షకులముందుకు రానుంది. ఇక ఈ సినిమా ట్రైలర్ ను బాలీవుడ్ యువ హీరో టైగర్ ష్రాఫ్ విడుదల చేయనున్నాడు. ఈరోజు సాయంత్రం 5:02గంటలకు ఈ ట్రైలర్ విడుదల కానుంది.

ఇక ఇంతకుముందు టైగర్ ష్రాఫ్ హీరోగా నటించిన ‘భాగీ ‘చిత్రంలో ప్రతినాయకుడి పాత్రలో నటించారు. ఈచిత్రం తెలుగు సూపర్ హిట్ మూవీ ‘వర్షం’ ఆదారంగా తెరకెక్కింది.

Exit mobile version