ట్రైలర్ టాక్..అద్భుతంగా అనిపిస్తున్న “తలైవి”.!

Published on Mar 23, 2021 11:37 am IST

పాన్ ఇండియన్ ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్న మోస్ట్ అవైటెడ్ బయోపిక్ చిత్రాల్లో తమిళనాట అమ్మ గా పిలవబడే లెజెండరీ నటి అంతకు మించిన రాజకీయ నాయకురాలు జయలలిత జీవిత చరిత్రపై బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో నటిస్తున్న “తలైవి” చిత్రం కూడా ఒకటి. మరి ఈ మోస్ట్ అవైటెడ్ చిత్రం తాలూకా ట్రైలర్ ను మేకర్స్ ఇప్పుడే విడుదల చేసారు.

ఇక ఈ ట్రైలర్ చూసాక మళ్ళీ ఇండియన్ సినిమా దగ్గర ఒక పర్ఫెక్ట్ బయోపిక్ వస్తుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇలాంటి బయోపిక్స్ కు కావాల్సిన గ్రాండియర్ టేకింగ్ ను దర్శకుడు విజయ్ ఖచ్చితంగా వంద శాతంకు మించే ఇచ్చినట్టు అనిపిస్తుంది. జయలలిత సినిమా కోణాన్ని అలాగే రాజకీయ జీవితాన్ని చాలా క్లియర్ గా చూపించిన విధానం సాలిడ్ గా ఉంది.

ముఖ్యంగా కంగనా తన స్క్రీన్ ప్రెజెన్స్ తో ఆ లెజెండరీ పర్సనాలిటీని మరిపించి ప్రతీ ఒక్కరి అనుమానాలు పటాపంచలు చేసేసింది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ సినిమాకు ఆమెను అనౌన్స్ చెయ్యడం అలాగే ఆ మధ్య వచ్చిన ఆమె లుక్స్ పరంగా కెన్నీ విమర్శలు వచ్చాయి. కానీ ట్రైలర్ లో మాత్రం కంగనా తన అద్భుతమైన పెర్ఫామెన్స్ తో భిన్నమైన షేడ్స్ తో రక్తి కట్టించింది.మరి ఎం జి ఆర్ రోల్ లో నటించిన టాలెంటెడ్ నటుడు అరవింద స్వామి ఆ రోల్ లో కరెక్ట్ గా సెట్టయ్యి మరో బిగ్ ఎస్సెట్ గా కనిపిస్తున్నారు.

అంతే కాకుండా లెజెండరీ రచయిత విజయేంద్ర ప్రసాద్ రచన కూడా ఈ చిత్రంలో చాలా స్ట్రాంగ్ గా అనిపిస్తుంది. మరి వీటితో పాటుగా మరో స్పెషల్ మెన్షన్ ఈ ట్రైలర్ లో సంగీతం ఇచ్చిన జీవి ప్రకాష్ బ్యాక్గ్రౌండ్ స్కోర్, విశాల్ విట్టల్ ల సినిమాటోగ్రఫీ స్యూర్ షాట్ గ్రాండియర్ ను చూపించాయి. నిర్మాణ విలువలు కూడా ఉన్నతంగా ఉన్నాయి. ఓవరాల్ గా మాత్రం “తలైవి” ట్రైలర్ ఒక అద్భుతంలా ఉంది. విష్ణు వర్ధన్ ఇందూరి మరియు శైలేష్ ఆర్ నిర్మాణం వహించిన ఏఈ భారీ చిత్రం వచ్చే ఏప్రిల్ 23న గ్రాండ్ ఫా విడుదల కానుంది.

ట్రైలర్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

సంబంధిత సమాచారం :