ఈ శనివారం ప్రపంచవ్యాప్తంగా ఘనమైన రీతిలో విడుదలైన విక్టరీ వెంకటేష్, పవన్ కళ్యాణ్ ల ‘గోపాల గోపాల’ చిత్రం మంచి కలెక్షన్ లను సాధిస్తూ పండుగ వాతావరణాన్ని కాస్త ముందుగానే తెచ్చిపెట్టింది. అయితే ఎటువంటి సినిమాకైనా గంటల వ్యవధిలో పైరసీ రెడీ అయిపోతున్న ఈ రోజుల్లో ‘గోపాల గోపాల’ అందుకు మినహాయింపు కాలేదు. ఆరోజు సాయింత్రానికే పైరసీ వచ్చిందన్న వార్తలు వినిపించాయి
అయితే తాజా సమాచారం ప్రకారం హైదరాబాద్ నుండి విజయవాద్ వెళ్తున్న ధనుంజయ ట్రావెల్స్ బస్సులో ఈ పైరసీ ప్రింట్ ని ప్రదర్శించినట్టు తెలుస్తుంది. ” AP 28 TB 6789″ అనేది ఆ బస్సు నెంబరు అని కూడా ఖరారయ్యింది. కేవలం కస్టమర్లను ఆకట్టుకోవడం కోసమే ఇటువంటి అడ్డదార్లు తొక్కే వ్యాపారసంస్థలపై చర్య తీసుకోవాలని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


