ధనుష్ ‘వడచెన్నై’కి ఊహించని రేటింగ్స్ !

ధనుష్ ‘వడచెన్నై’కి ఊహించని రేటింగ్స్ !

Published on Oct 17, 2018 3:11 PM IST


వెట్రి మారన్ దర్శకత్వంలో తమిళ స్టార్ హీరో ధనుష్ నటించిన చిత్రం ‘వడచెన్నై’. ఈచిత్రం మూడు భాగాలుగా విడుదల కానుందని తెలిసిందే. ఈరోజు ప్రేక్షకులముందుకు వచ్చిన ఈచిత్రంలోని మొదటి భాగం తమిళ సినీ విశ్లేషకులనుండి అనుహ్యమైన రేటింగ్స్ ను రాబట్టింది. గ్యాంగ్ స్టార్ డ్రామా గా తెరకెక్కిన ఈచిత్రానికి క్రిటిక్స్ 4.5 /5 రేటింగ్స్ ఇచ్చారు.

ఇక స్టోరీ , డైరెక్షన్ , ధనుష్ , ఐశ్వర్య రాజేష్ ల నటన ఈచిత్ర విజయంలో కీలక పాత్రను పోషించాయని సమాచారం. ‘రఘువరన్ బీటెక్’ నుండి తన అన్ని చిత్రాలను తెలుగులో విడుదల చేసుకున్న ధనుష్ ఈ చిత్రాన్ని మాత్రం ఇక్కడ రిలీజ్ చేయలేదు. పూర్తిగా తమిళులకు సంభందించిన స్టోరీ కావడంతో ఈ చిత్రాన్ని తెలుగులో విడుదల చేయలేదని తెలుస్తుంది. సంతోష్ నారాయనన్ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని ధనుష్ నిర్మించాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు