
నందమూరి నట సార్వభౌమ ఎన్టీఆర్ హీరోగా నటించిన ‘బందిపోటు’ సినిమా ఘనవిజయం సాదించింది. ఇప్పుడే ఇదే టైటిల్ తో అల్లరి నరేష్ హీరోగా మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కింది. ఈ శుక్రవారం అల్లరి నరేష్ ‘బందిపోటు’ సినిమా విడుదలవుతుంది.
ఎన్టీఆర్ టైటిల్ గురించి అల్లరి నరేష్ మాట్లాడుతూ.. ఒక నట దిగ్గజం నటించిన టైటిల్ తో సినిమా చేస్తున్నప్పుడు మనపై ఒత్తిడి ఉంటుంది. క్లాసికాల్ హిట్స్ గా నిలిచిన ఆ సినిమాకు చెడ్డ పేరు తీసుకొచ్చే విధంగా మన సినిమా ఉండకూడదు. ఈ ‘బందిపోటు’ ఎన్టీఆర్ సినిమాను గౌరవించేలా ఉంటుంది. సినిమాలో మేము ఎన్టీఆర్ గారికి ఓ ట్రిబ్యూట్ చేశాం. అదేంటో మీరు సినిమా చూసి తెలుసుకోవాలి అని అన్నారు.
గతంలో ‘ఆహా నా పెళ్ళంట’ సినిమా సమయంలో కూడా ఇదే తరహా ఒత్తిడి ఎదురైంది. రామానాయుడు గారు నిర్మించిన రాజేంద్ర ప్రసాద్ గారి ‘ఆహా నా పెళ్ళంట’ పెద్ద విజయం సాదించింది. అప్పుడు జాగ్రత్తగా సినిమా చేశాం. ఇప్పుడే కూడా అంతే. సినిమా విజయవంతమవుతుంది. అని నరేష్ చెప్పారు.
ఈషా హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో సంపూర్నేష్ బాబు, అవసరాల శ్రీనివాస్ ప్రధాన పాత్రలలో నటించారు. ఓ స్పెషల్ సాంగులో శ్రద్ధా దాస్ సందడి చేయనుంది. కళ్యాణి కోడూరి సంగీత దర్శకుడు. ఇ.వి.వి. సినిమా పతాకంపై ఆర్యన్ రాజేష్ ఈ సినిమాను నిర్మించారు.

