గత శుక్రవారం విడుదలైన ఆటోనగర్ సూర్య మొదటి రోజు పబ్లిక్ నుండి యావరేజ్ రెస్పాన్స్ ని సొంతం చేసుకుంది. అందరి అభిప్రాయం తెలుసుకున్న తర్వాత ఈ చిత్ర టీం 12 నిమిషాలను కట్ చేసింది, అలాగే కొన్ని పాటలని కూడా కట్ చేసారు. ఈ రోజు నుంచి ఈ ట్రిమ్ వెర్షన్ ని థియేటర్స్ లో ప్రదర్శించారు.
ఈ సినిమా సెకండాఫ్ బాగా సాగదీసినట్టు ఉండడం ఈ సినిమాకి బిగ్ మైనస్ అని అన్దరోఒ అభిప్రాయపడడంతో దేవకట్టా, అతని టీం ట్రిమ్ చేసారు. ట్రిమ్ చేసిన వెర్షన్ కి మంచి రెస్పాన్స్ వస్తోంది. నాగ చైతన్య, సమంత జంటగా నటించిన ఈ సినిమాకి అనూప్ రూబెన్స్ మ్యూజిక్ అందించాడు.


