మార్చి 27 మెగా అభిమానులకు పండగే

మార్చి 27 మెగా అభిమానులకు పండగే

Published on Mar 19, 2013 10:54 PM IST

ramcharan-zanjeer

ఈ మార్చి 27న మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా మెగా ఫాన్స్ కి భారి రోజు కానుంది. ఆంద్ర ప్రదేశ్ లో స్టార్ల పుట్టినరోజులకి వాళ్ళ ఫాన్స్ భారీ రీతిలో జరుపుటకి రక్తదానాలు, సామాజిక సేవలు వంటి రకరకాల పనులు చేయడం పరిపాటే.

రెండవది, ఈ రోజునాడే మనం చాలా రోజుల నుండి ఎదురు చూస్తున్న ‘జంజీర్’ ఫస్ట్ లుక్ విడుదల కానుంది. ఈ సినిమా తెలుగూ వెర్షన్ ‘తూఫాన్’ గా మన ముందుకు రానుంది. ఇందులో రామ్ చరణ్ సరసన ప్రియాంక చోప్రా, ప్రకాష్ రాజ్ మరియు శ్రీహరి ప్రధాన పాత్రధారులు. అపూర్వ లఖియా ఈ సినిమాకి దర్శకుడు. తెలుగు వెర్షన్ యోగి పర్యవేక్షణలో జరుగుతుంది. ‘జంజీర్’ రామ్ చరణ్ కి బాలీవుడ్లో మొదటి చిత్రం కనుక అంచనాలు భారీ స్థాయిలోనే ఉన్నాయి.

ఈ రెండూ కాకుండా రామ్ చరణ్ తెలుగు సినిమా ‘ఎవడు’ చిత్ర నిర్మాతలు మార్చి 27న ఈ సినిమా ఫస్ట్ లుక్ విడుదల చేయనున్నారు. ‘ఎవడు’ సినిమా ఒక స్టైలిష్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతుంది. రామ్ చరణ్ సరసన శ్రుతి హాసన్ నటిస్తున్న ఈ సినిమాలో అమీ జాక్సన్ రెండో హీరొయిన్. అల్లు అర్జున్ మరియు కాజల్ ముఖ్యమైన పాత్రలు పోషిస్తున్నారు . వంశీ పైడిపల్లి దర్శకుడు. దిల్ రాజు నిర్మాత.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు