
గత 12 సంవత్సరాలుగా తెలుగు, తమిళ భాషల్లో ఏ మాత్రం గ్యాప్ లేకుండా వరుసగా సినిమాలు చేస్తున్న హీరోయిన్ త్రిష. అందరూ అంటున్నట్టు త్రిష మునుపటిలా ఒకేసారి నాలుగైదు సినిమాలు చేయకపోయినా స్టార్ హీరోలతో కంటిన్యూగా సినిమాలు చేస్తూనే ఉంది, అలాగే హిట్స్ కూడా అందుకుంటోంది. అటు కన్నడ, ఇటు తమిళంలో వరుస హిట్స్ అందుకొని ఉన్న త్రిష త్వరలోనే తెలుగులో బాలకృష్ణతో కలిసి నటించిన ‘లయన్’ సినిమాతో రానుంది. ఈ సినిమాతో తెలుగులో కూడా హిట్ అందుకుంటానని త్రిష చాలా కాన్ఫిడెంట్ గా ఉంది.
ఇదిలా ఉంటే త్రిష మరో క్రేజీ కాంబినేషన్ లో మొదలు కానున్న క్రేజీ ప్రాజెక్ట్ కి సైన్ చేసింది. ‘7/జి బృందావనకాలనీ’, ‘ఆడవారి మాటలకు అర్థాలే వేరులే’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం ఉన్న సెల్వరాఘవన్ ఈ సారి మరో లవ్ స్టొరీతో సినిమా చేయనున్నాడు. ఈ సినిమాలో తమిళ యంగ్ హీరో శింబు హీరోగా నటించనున్నాడు. తాజాగా ఈ సినిమాలో శింబు సరసన హీరోయిన్ గా త్రిషని ఫైనలైజ్ చేసారు. గతంలో శింబు – త్రిష కాంబినేషన్ లో వచ్చిన ‘విన్నైతాండి ఒరువాయ(తెలుగులో ఏమాయ చేసావే)’ సినిమా హిట్ అయ్యింది. త్రిష సెల్వరాఘవన్ డైరెక్షన్ లో కూడా ఓ సినిమా చేసింది. మళ్ళీ శింబు – త్రిష – సెల్వరాఘవన్ కాంబినేషన్ లో రానున్న ఈ సినిమా మేలో మొదలు కానుంది.

