సౌత్ ఇండియా సీనియర్ నటి ఖుష్బూ – దర్శకుడు సుందర్.సి ల కుమార్తె అవంతిక వివాహం గోవా వేదికగా ఘనంగా జరిగింది. మర్చంట్ నేవీ ఆఫీసర్ శ్రవణ్‌తో జరిగిన ఈ వివాహ వేడుకకు సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు హాజరై సందడి చేశారు.
ఈ వేడుకలో స్టార్ హీరోయిన్లు త్రిష కృష్ణన్, తమన్నా భాటియా ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. సంప్రదాయ దుస్తుల్లో మెరిసిపోయిన ఈ ఇద్దరు భామలు.. నూతన వధూవరులతో కలిసి చిరునవ్వులతో ఫోటోలకు పోజులిచ్చారు. ఈ అపురూపమైన ఫ్యామిలీ ఫోటోలో ఖుష్బూ, సుందర్ సి కూడా ఉన్నారు.
ఇక సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం తమన్నా ఎరోటిక్ హారర్ థ్రిల్లర్ ‘రాగిణి ఎంఎంఎస్ 3’ షూటింగ్‌లో బిజీగా ఉండగా, త్రిష ఇటీవలే ‘కరుప్పు’ చిత్రంతో భారీ బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకుంది.


