పవన్ సరసన నటించనున్న త్రిష?

పవన్ సరసన నటించనున్న త్రిష?

Published on Apr 8, 2015 3:25 AM IST

pawan-kalyan-trisha
అందాల భామ త్రిష కృష్ణన్ కి ఇటీవలే వరుణ్ మానియన్ తో నిశ్చితార్ధం జరిగింది. వెనువెంటనే టాలీవుడ్, కోలీవుడ్ లో వరుసపెట్టి ఆఫర్లు రావడం విశేషం. అయితే తాజా సమాచారం ప్రకారం త్రిష పవన్ కళ్యాణ్ సరసన నటించే అద్భుతమైన అవకాశాన్ని సొంతం చేసుకుంది.

గతంలో వీరిద్దరూ కలిసి తీన్ మార్ సినిమాలో నటించారు. ఇప్పుడు పవన్ తన తదుపరి సినిమాకోసం త్రిష పేరుని సూచించినట్టు సమాచారం.

అయితే త్రిష గబ్బర్ సింగ్ 2 లో నటిస్తుందా లేక దాసరి నారాయణ రావుగారి సినిమాలో నటిస్తుందా అన్న విషయం ఇంకా ఖరారు కాలేదు. అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడనుంది. మరిన్ని వివరాల కోసం మా సైట్ ని చదువుతూ వుండండి.

తాజా వార్తలు