ప్రముఖ నటి త్రిష ఇండస్ట్రీకి వచ్చి నేటితో పన్నెండేళ్ళు గడిచింది. తమిళ సినిమా జోడీలో అంతగా ప్రాముఖ్యత లేని పాత్రలో నటించింది. తరువాత పలు పెద్ద సినిమాలలో నటించి మంచి పేరుని సంపాదించుకుంది
నీ మనసు నాకు తెలుసు సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ భామ ప్రభాస్ తో వర్షం సినిమాలో జతకట్టిన తరువాత స్టార్ ఇమేజ్ ని సంతరించుకుంది.
ప్రస్తుతం సత్యదేవ దర్శకత్వంలో బాలకృష్ణతో ఒక సినిమా చేస్తుంది. కన్నడలో ఈమె నటించిన పవర్ సినిమా 100రోజుల మార్కుని టచ్ చేసింది


