‘నా జీవితంలో నిశ్చితార్థం(ఎంగేజ్మెంట్) అనేది అతి ముఖ్యమైన ఘట్టం. ఆ రోజు ఎంతో మధురమైనది. ఒకవేళ నిశ్చితార్థం జరిగితే ఆ విషయాన్ని సంతోషంగా అందరికి చెప్పే మొదటి వ్యక్తిని నేనే. అరకులో బాలకృష్ణ సరసన నటిస్తున్న సినిమా చిత్రీకరణలో బిజీగా ఉంటే, చెన్నైలో నిశ్చితార్థం ఎలా చేసుకోగలను.’ అని ప్రముఖ హీరోయిన్ త్రిష చెప్పారు. ఈ వివరణతో పుకార్లకు చెక్ పెట్టినట్టు అయ్యింది.
త్రిష, చెన్నైకు చెందిన పారిశ్రామికవేత్త, తమిళ నిర్మాత వరుణ్ మణియన్‌లు త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్నారని, వారి నిశ్చితార్థం రహస్యంగా జరిగిందని వార్తలు వెలువడ్డాయి. దశాబ్ద కాలంగా దక్షిణాది ప్రేక్షలను అలరించిన 31 ఏళ్ళ త్రిష, అవకాశాలు తగ్గడంతో పెళ్ళికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని ఆ వార్తల సారాంశం. వీటిని త్రిష ఖండించారు. కేవలం పుకార్లు మాత్రమేనని చెప్పారు.
2015 జూన్ వరకు తన డైరీ ఖాళిగా లేదని త్రిష తెలిపారు. తెలుగులో బాలయ్య సినిమాతో పాటు మరో మూడు తమిళ సినిమాలలో నటిస్తున్నారు.


