గత 15 సంవ్సత్సరాలుగా తెలుగు, తమిళ ప్రేక్షకులను అలరిస్తూ టాప్ హీరోయిన్ గా వెలుగొందిన భామ త్రిష. గత కొద్ది రోజులుగా ఆమెకు అవకాశాల సంఖ్య తగ్గినా చేసే సినిమాలన్నీ స్టార్ హీరోలతోనే చేస్తూ విజయాలను అందుకుంటోంది. ఇది పక్కన పెడితే గత కొద్ది రోజులుగా త్రిష పారిశ్రామికవేత్త, తమిళ నిర్మాత వరుణ్ మణియన్ తో ప్రేమలో ఉందని, త్వరలో పెళ్లి చేసుకోనుందని, ఇప్పటికే తెలియకుండా నిశ్చితార్ధం కూడా అయిపోయిందనే వార్తల్లు వచ్చాయి. అప్పట్లో ఆ వార్తలను ఖండించిన త్రిష తాజాగా తన ఎంగేజ్ మెంట్ గురించి అనౌన్స్ చేసి తన అభిమానుల హృదయాన్ని బ్రేక్ చేసింది.
‘నా ఫ్రెండ్స్, నా అభిమానులు మరియు మీడియా మిత్రులకు నేను చెప్పదలుచుకున్నది ఏమిటంటే జనవరి 23న వరుణ్ తో నా ఎంగేజ్ మెంట్ జరగనుంది. ఈ కార్యక్రమం చాలా ప్రైవేటుగా నా కుటుంబ సభ్యుల మధ్య జరగనుంది. ప్రస్తుతం మా పెళ్లి డేట్ గురించి వస్తున్న వార్తలను నమ్మవద్దు. ఎందుకంటే అందులో వాస్తవం లేదు. డేట్ ఫిక్స్ అయ్యాక నేనే చెప్తాను. పెళ్లి చేసుకోబోతున్నాను కదా అని నేను సినిమాలు చేయడం ఆపేయడం లేదు. చెప్పాలంటే త్వరలోనే మరో రెండు కొత్త సినిమాలకు సైన్ చేయనున్నాను. ఈ సంవత్సరం మొత్తం నావి 4 సినిమాలు రిలీజ్ అవుతాయని’ త్రిష ట్విట్టర్ ద్వారా తెలియజేసింది.
త్రిష ప్రసతుతం తెలుగులో బాలకృష్ణ సరసన ‘లయన్’ సినిమాలో, తమిళంలో అజిత్ సరసన ‘ఎన్నై అరింధాల్’ సినిమాల్లో నటిస్తోంది. త్రిషకి ఎంగేజ్ మెంట్ కుదిరిన సందర్భంగా 123తెలుగు. కామ్ తరపున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం..


