
అందాల భామ త్రిషకు నేడు చెన్నైలో అనగరంగ వైభవంగా నిశ్చితార్ధం జరిగింది. కేవలం ఎంపిక చేసిన ప్రముఖులు మాత్రమే ఈ వేడుకకు హాజరయ్యారు. ఈ శుభముహుర్తాన త్రిష నీతా లుల్లా డిజైన్ చేసిన పింక్ డ్రెస్ లో అందంగా కనువిందు చేసింది. ఇరు కుటుంబ సభ్యులు ఈ వేడుకకు విజయం చేశారు.
త్రిష త్వరలో చెన్నై లో నివసిస్తున్న వ్యాపారవేత్త వరుణ్ మానియన్ ని ఫిబ్రవరిలో పెళ్ళి చేసుకోనుంది. 123తెలుగు తరుపున త్రిషకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.

