విక్రమ్ సినిమా నుంచి అందుకే తప్పుకున్నా – త్రిష

Published on Aug 2, 2018 9:04 am IST

చియాన్ విక్రమ్, త్రిషలు జంటగా 2003లో దర్శకుడు హరి రూపొందించిన చిత్రం ‘సామి’ ఘన విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సీక్వెల్ గా ‘సామి స్క్వేర్’ ను రూపొందిస్తున్నారు హరి. ఈ పోలీస్ స్టోరీలో విక్రమ్ కు సరసన కీర్తి సురేష్ ప్లేస్ లో మొదటిగా త్రిషనే నటించాలని కోరుకుంది చిత్రబృందం. కానీ కొన్ని కారణాల వల్ల ఈ చిత్రంలో త్రిష నటించలేదు.

ఐతే తాజాగా ‘సామి స్క్వేర్’ లో నటించపోవడానికి కారణాన్ని త్రిష ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. వివరాల్లోకి వెళ్తే.. త్రిష మాట్లాడుతూ ‘సామి స్క్వేర్’ కథ నాకు తగ్గట్లు లేదనిపించింది. అందుకే ప్రారంభంలోనే నేను ఆ చిత్రంలొంచి వైదొలిగాను. నిజానికి నేనస్సలు చిత్రీకరణలో కూడా పాల్గొనలేదని త్రిష తెలిపింది.

ఇక విక్రమ్ సరసన కీర్తి సురేష్ , ఐశ్వర్య రాజేష్ కథానాయికలు గా నటిస్తున్న ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. బాబీ సింహ ప్రతినాయకుడి పాత్రలో నటిస్తున్న ఈ చిత్రాన్ని తమీన్స్ ఫిలిమ్స్ పతాకం ఫై శిబు తమీన్స్ నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం :

X
More