స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో పాల్గొన్న త్రిష.

స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో పాల్గొన్న త్రిష.

Published on Dec 3, 2014 9:56 AM IST

trisha-participates-in-swac
ప్రముఖ హీరోయిన్ త్రిషకు మూగ జీవాలు అంటే ప్రత్యేక అభిమానం. పెటా తరపున ప్రచారం కూడా చేస్తుంది. తాజాగా స్వచ్ఛ భారత్ కార్యక్రమం కోసం ఒక యానిమల్ హోంను ఎంచుకుంది. బుధవారం ఉదయం ఎన్విరాన్మెంటల్ ఫౌండేషన్ అఫ్ ఇండియా వాలంటీర్లతో కలసి కాంచీపురం సమీపంలోని ఒక యానిమల్ హోంలో త్రిష క్లీన్ ఇండియా కాంపెయిన్ నిర్వహించారు. యానిమల్ హోం పరిసర ప్రాంతాలను శుబ్రం చేశారు.

క్లీన్ ఇండియా కాంపెయిన్ లో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని త్రిష తెలిపారు. ప్రతి ఒక్కరు తమ బాధ్యతను నిర్వహించాలని కోరారు. భారత ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించిన ఈ కార్యక్రమంలో అనేక మంది సినీ ప్రముఖులు పాల్గొన్నారు. ప్రజలను చైతన్యవంతులు చేయడానికి ముందడుగు వేస్తున్నారు.

తాజా వార్తలు