సతీష్ వేగేశ్నదర్శకత్వంలో నటించనున్న సీనియర్ హీరోయిన్ !
Published on Jun 13, 2018 1:09 am IST

‘శతమానం భవతి’ చిత్రంతో మంచి గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు సతీష్ వేగేశ్న ఈయన ప్రస్తుతం నితిన్, రాశీఖన్నా జంటగా ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మాణంలో ‘శ్రీనివాస కళ్యాణం’ అనే సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రం తరువాత ప్రముఖ బ్యానర్ దుర్గ ఆర్ట్స్ లో సినిమా చేయనున్నారన్న విషయం తెలిసిందే.

ఇప్పుడు ఈ సినిమాలో సీనియర్ హీరోయిన్ త్రిష కథానాయికగా నటించనుంది . సతీష్ చెప్పిన స్టోరీ త్రిషకు బాగా నచ్చి వెంటనే ఈ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలను ప్రకటించే అవకాశం ఉంది. గతంలో అనేక చిత్రాలకు రచయిత గా పనిచేసిన సతీష్ వేగేశ్న శతమానం భవతి సినిమాతో కుటుంబ ప్రేక్షకులకు దగ్గరయ్యారు. ఈ సినిమా కు బెస్ట్ డైరెక్టర్ గా జాతీయ అవార్డు ను సొంతం చేసుకున్నాడు .

  •  
  •  
  •  
  •  

 
Subscribe to our Youtube Channel
 
Like us on Facebook