అందాల భామ త్రిష తెలుగు మరియు తమిళ భాషల్లో సక్సెస్ఫుల్ హీరోయిన్ గా వెలుగొందుతోంది. తన సక్సెస్ఫుల్ కెరీర్ ని ఇంకా కొనసాగిస్తూనే ఉంది. తన కెరీర్లో ఎన్నో సక్సెస్ఫుల్ కమర్షియల్ సినిమాలు ఉన్నాయి. చెప్పాలంటే ఇటీవల తన హవా కాస్త తగ్గినా మళ్ళీ ఫుల్ క్రేజ్ తో వరుస సినిమాలు చేస్తోంది.
ప్రస్తుతం త్రిష తనకి ఏమి కావాలో, ఎలాంటి సినిమాలు చేయాలనిపిస్తుందో అలాంటి వాటిపైనే దృష్టి పెడుతోంది. అందులో భాగంగా త్రిష ఇప్పుడు ప్రయోగాత్మక పాత్రలకు, సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తోంది. ఈ నిర్ణయం తీసుకోవడమే కాకుండా త్రిష ప్రస్తుతం కమర్షియల్ ఎలిమెంట్స్ లేని మరియు గ్లామర్ అవసరం లేని పాత్రలకు సంబందించిన కథలను కూడా వింటోంది.
ప్రస్తుతం త్రిష తెలుగులో నందమూరి బాలకృష్ణ సరసన హీరోయిన్ గా నటిస్తోంది. ఇది కాకుండా తమిళంలో అజిత్ సరసన ఓ సినిమా చేస్తోంది. మరి ఇప్పుడు ఇచ్చిన గ్రీన్ సిగ్నల్ తో ఎంతమంది త్రిషని ప్రయోగాత్మక సినిమాలతో కలుస్తారో.? అందులో దేనికి త్రిష గ్రీన్ సిగ్నల్ ఇస్తుందో? చూడాలి..


